ఛార్మికి మతి చెడిందా...కరోనా వస్తే అంత ఆనందం ఎందుకు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. దేశంలో రెండు కోవిడ్ కేసులు నమోదైనట్టు.. కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశరాజధాని ఢిల్లీలో ఒక కేసు, రాష్ట్ర రాజధాని హైరదాబాద్లో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది....ఇటు, కరోనా రక్కసి.. తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఒక కోవిడ్ నైన్టీన్ కేసు నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా రెండు కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర కేంద్ర వైద్యఆరోగ్యశాఖ దృవీకరించింది. ఒక కోవిడ్ కేసు హైదరాబాద్లో నమోదు కాగా, మరో కేసు దేశరాజధాని ఢిల్లీలో నమోదైనట్టు ప్రకటించింది. ప్రస్తుతం వారిద్దరికీ చికిత్స అందుతోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
అయితే కరోనా పాజిటివ్ కేసులతో ఇండియాలో హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఇంతలా ప్రభుత్వాలు టెన్షన్ పడుతుంటే ఇప్పుడు నిర్మాతగా మారిన హీరోయిన్ ఛార్మి మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. కరోనా ఇండియాకి వచ్చేసిందని అందుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న చార్మి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో అసలు ఆమెకు బుద్ధి ఉందా లేక మతి చెడిందా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసేసింది ఛార్మి. అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆమె వీడియోలను దౌన్ లోడ్ చేసి మరీ పోస్ట్ చేసి తిడుతున్నారు. ఒకపక్క ప్రాణంతక వ్యాధి వలన అందరూ టెన్షన్ పడుతోంటే ఆమె అలా చేయడం ఎవరికీ నచ్చలేదు అందుకే తిట్టి పోస్తున్నారు.