English   

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడానికి మరో కారణం ఉందా..

mb
2020-03-03 06:47:14

మరికొన్ని రోజుల్లో మొదలవుతుంది అనుకున్న ప్రాజెక్టు కాస్తా అనుకోకుండా ఆగిపోయింది. మేలో మొదలుకావాల్సిన మహేష్, వంశీ పైడిపల్లి సినిమా ఉన్నట్టుండి ఆగిపోయేసరికి అభిమానులు కూడా షాక్ అయ్యారు. వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్టులో మహేష్ బాబు కొన్ని అనుమానాలు వచ్చాయని.. వాటిని మహేష్ కు నచ్చేలా మార్చడంలో వంశీ పైడిపల్లి విఫలం కావడంతో సినిమాను ఆపేశారని ప్రచారం జరిగింది. కానీ అసలు కారణం మాత్రం అది కాదని తెలుస్తుంది. స్క్రిప్టు మొత్తం విన్న తర్వాత వంశీ పైడిపల్లికి ఓకే చెప్పాడు మహేష్. కానీ ఆ తర్వాత మళ్ళి కథ నచ్చకపోవడం ఏంటని అడుగుతున్నారు అభిమానులు. దీని వెనుక అసలు కారణం ఒకటి ఉందని తెలుస్తుంది. మహేష్ అడిగిన రెమ్యూనరేషన్ కి నిర్మాత దిల్ రాజు ఒప్పుకోకపోవడమే ఈ సినిమా ఆగిపోవడానికి కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా సంచలన విజయం సాధించడంతో తన నెక్స్ట్ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడు మహేష్ బాబు. అయితే దిల్ రాజు ఆ మొత్తానికి అంగీకరించకపోవడంతో మహేష్ ప్రాజెక్ట్ ఆపేశారని కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో నిజం కూడా లేకపోలేదు. దానికి కారణం స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాకే మహేష్.. వంశీ సినిమాకు ఓకే చెప్పాడు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లే ముందు కూడా వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మధ్యలో ఏదో జరిగింది. దాంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది. మహేష్ బాబు అడిగిన రెమ్యూనరేషన్ దిల్ రాజు ఇవ్వనని చెప్పడంతో ఈ సినిమా ఆపేసారని తెలుస్తుంది. ఏదేమైనా కూడా మహర్షి ఇలాంటి విజయం తర్వాత మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ రెమ్యూనరేషన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. మంచి నిర్మాత దొరికితే వంశీతో త్వరలోనే సినిమా చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్.

More Related Stories