English   

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పై స్పందించిన వర్మ.. ఇడియట్ అంటూ..

rgv
2020-03-03 07:02:33

ప్రపంచంలో జరిగే ప్రతి విషయంపై స్పందిస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే దానిపై మాట్లాడకుండా ఉండగలడా.. ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈయన. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పై తన స్పందన వెరైటీగా తెలియజేశాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అందులో పవన్ కళ్యాణ్ కాళ్ళు చాపుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు. ఈ లుక్ చూసి ఇప్పటికే అభిమానులు ఫిదా అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పవన్ కళ్యానే..

ఆయన సినిమా వస్తే పండగ చేసుకోవడమే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పై చిత్రంగా స్పందించాడు. వకీల్ సాబ్ పోస్టర్ జత చేస్తూ.. నేను కొంత మంది ఇడియట్స్‌ గురించి ఆలోచించను. ఇలాంటి ఇడియట్‌ పనులను చేయను అంటూ రాసుకొచ్చాడు. ఆ పోస్టర్‌లో పవన్‌ కూర్చున్న స్టైల్‌లోనే కూర్చున్న వర్మ 'డైరెక్టర్‌ సాబ్‌' అంటూ టైటిల్‌ ఇవ్వడం గమనార్హం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలపై వర్మ తనదైన శైలిలో స్పందించాడు. కొన్ని రోజులుగా పవన్ రాజకీయాల్లో ఉన్న కూడా ఆయన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు వర్మ. మళ్లీ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాపై తన రియాక్షన్ తెలియజేశాడు. ఇది చూసి పవన్ అభిమానులు కొందరు వర్మను టార్గెట్ చేస్తున్నారు.

More Related Stories