English   

అందంగా లేనని అదిరింది నుంచి తప్పించారు.. స్పందించిన యాంకర్ సమీరా..

anchor
2020-03-03 07:36:30

తెలుగు ఇండస్ట్రీలో కామెడీ షో అంటే జబర్దస్త్ గుర్తుకొస్తుంది.  దానికి పోటీగా ఎన్ని కామెడీ షోలు వచ్చినా కూడా పెద్దగా నిలబడలేదు. అయితే జీ తెలుగులో అదిరింది అంటూ భారీగా ఒక కామెడీ షో మొదలుపెట్టారు. జబర్దస్త్ లో చేసిన కొందరు కమెడియన్లను అందులో తీసుకున్నారు. అందులో యాంకర్ గా సమీరాను తీసుకున్నారు. అయితే 10 వారాల తర్వాత ఆమెను షో నుంచి తప్పించారు. ఈమధ్య విడుదలైన ప్రోమోలో సమీరా కనిపించలేదు. దాంతో ఈమెను ఎందుకు తప్పించారని చాలామంది అడుగుతున్నారు. దీనికి ఇప్పుడు సమీరా సమాధానం చెప్పింది. "అందరికీ నమస్కారం. చాలా మంది అదిరింది షో నుంచి ఎందుకు తప్పుకున్నారు అని చాలా మంది మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. నేను ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను షో నుంచి నా అంతట నేను వెళ్లిపోలేదు. వాళ్లే తీసేసారు. నాకు ఈ విషయం ప్రొడక్షన్ వాళ్లు చెప్పలేదు. మీడియా ద్వారానే తెలిసింది. ఆ తర్వాత నేను వెళ్లి అడిగితే అవును.. ఎప్పటినుంచో యాంకర్‌ను మార్చాలని అనుకుంటున్నాం..

ఇప్పుడే సరైన సమయం అని మార్చేసాం అని చెప్పారు. ఎవర్ని తీసుకుంటున్నారు అని కూడా అడగలేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. కొత్త్ ప్రోమో లింక్ ఎవరో పంపితే చూసాను. రవి, భానుశ్రీలతో షో చేస్తున్నారని తెలిసింది. వాళ్లిద్దరూ నాకు తెలుసు. మంచి యాంకర్స్. మరో విషయం ఏంటంటే.. నేను పది ఎపిసోడ్లకు ఒప్పుకోలేదు. 26 ఎపిసోడ్లకు కాంట్రాక్ట్‌పై సంతకం చేసాను. కానీ టెక్నికల్ పరంగా లేదా ఏదైనా ప్రొడక్షన్ పరంగా ఏవైనా సమస్యలు వచ్చి ఉండొచ్చు. నేను ఈ రంగంలో పదిహేనేళ్లుగా ఉన్నాను. టెక్నికల్ పరంగా ఎన్ని సమస్యలు వస్తాయో నాకు తెలుసు. అయితే నన్ను ఎందుకు తీసేసారు అని మాత్రం నేను అడగలేదు. బహుశా వారికి ఇంకా అందంగా ఉండే యాంకర్ కావాలేమో. నేను ప్రెగ్నెంట్ అని అందుకే షో నుంచి వచ్చేసానని అంటున్నారు. నేను ప్రెగ్నెంట్ కాదు. అలాంటి గుడ్‌న్యూస్ ఉంటే మీరంతా నా కుటుంబం కాబట్టి తప్పకుండా షేర్ చేస్తాను. నాకు ఎవరి మీదా ఎలాంటి కోపాలు, కుళ్లుకోవడాలు లేవు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. నేను యాంకర్‌గా చేస్తున్నప్పుడు యాంకర్‌ను మార్చండి అని కామెంట్స్ చేసినవారే.. ఇప్పుడు వెళ్లిపోయాక ఎందుకు వెళ్లిపోయారు అంటున్నారు. అదిరింది షో ఇక నుంచి మరింత అదిరిపోతుంది అనుకుంటున్నాను. నేను షోలో భాగం కానంత మాత్రాన షోని మర్చిపోను. తప్పకుండా ప్రతీ వారం చూస్తాను. ధన్యవాదాలు" అంటూ ముగించింది సమీరా.

More Related Stories