English   

చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా చెప్పలేదు ఏంటి..

chiru
2020-03-03 07:52:11

చిరంజీవి, కొరటాల సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కొన్ని రోజులుగా  రామోజీ ఫిలిం సిటీలోనే చిరంజీవిపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. దీనికి సమాధానం తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే మ‌రో హీరోయిన్ కూడా లైన్ లోకి వ‌చ్చింది. చిరంజీవితో ఇదివ‌ర‌కు న‌టించిన కాజ‌ల్ మ‌రోసారి ఈ సినిమాలో న‌టించ‌నుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఖైదీ నెం 150లో న‌టించిన ఈ భామ‌నే మ‌రోసారి తన సినిమాలో రిపీట్ చేయాలని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొరటాల శివ. ఈ చిత్రం నక్సలిజం నేప‌థ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ప్రభుత్వంపై సెటైర్లు వేసే విధంగా ఈ పాత్రను కొరటాల డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం ఏకంగా 30 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాన‌ని కనిపిస్తున్నాడు మెగాస్టార్. అన్ని కమర్షియల్ హంగులతో కొరటాల శివ, చిరంజీవి సినిమా రాబోతుంది. 2020లో సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి చూడాలి కొరటాల శివ సినిమాలో చిరంజీవితో ఎవరు జోడి కట్టబోతున్నారో..?

More Related Stories