అనన్యతో విజయ్ దేవరకొండ హాగ్...ఆడుకుంటున్న నెటిజన్లు

కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయమైంది బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతరు అనన్య పాండే. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. రీసెంట్గా ఈ భామ ఆ సినిమా షూటింగ్లో పాల్గొంది. విజయ్ దేవరాకొండ బైక్ మీద ఆమె ఎక్కి కూర్చున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఆమె మరో మారు కెమెరాల కంటికి చిక్కారు. అయితే ఈసారి విజయ్ తో పాటు ఆ సినిమా సహా నిర్మాత ఛార్మి కూడా కనిపించింది.
నిన్న వీరు ముగ్గురూ కలిసి ఒక ఫెర్రీ ఎక్కిన సమయంలో కెమెరాల కంటికి చిక్కారు. ఈ సమయంలో విజయ్ ని పలకరించేందుకు ముందుకు రాగా విజయ్ ఆమెను హాగ్ చేసుకుంటున్న పిక్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పిక్ తీసేప్పుడు విజయ్ కూర్చుని ఉండగా అనన్య నుంచుని ఉంది, సో మనోడు హాగ్ చేసుకునేప్పుడు సరిగ్గా ఆమె ఎద భాగానికి దగ్గరగా మొహం పెట్టి హాగ్ చేసుకున్నాడు. దీంతో విజయ్ మీద ట్రోల్స్ మొదలయాయి.
ఇక ఈ వీడియో తీస్తున్న సమయంలో ఛార్మిని ఈ సినిమా ఫైటర్ కదా అని అడగగా ఆమె కాదని చెప్పుకొచ్చింది. మరేమిటి ? అని అడిగితే చెప్తాం చెప్తాం అంటూ దాటవేసింది.