English   

కన్నడలో బాహుబలి రేంజ్ సినిమా...టాలీవుడ్ డైరెక్టర్ కధతో...

Darshan.jpg
2020-03-03 16:55:28

కేజీఎఫ్ సినిమా దెబ్బకి కన్నడ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. అక్కడి సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా అక్కడ బాహుబలి రేంజ్ సినిమా ఒకటి ప్లాన్ చేసినట్టు సమాచారం. అదే రాజ వీర మడకరి నాయక. ఎస్‌.వి.రాజేంద్ర సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కేరళలో కొంత మేర షూట్ కూడా చేశారు. తాజాగా సినిమా రెండో షెడ్యూల్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో రాజమాతగా కన్నడ అలనాటి హీరోయిన్ సుమలత నటిస్తున్నట్టు చెబుతున్నారు.  దొడ్డన్న, పి.రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కధను డీఎస్ కన్నన్ అందించినట్టు చెబుతున్నారు. గతంలో  ‘సారాయి వీర్రాజు’ అనే సినిమా తీసిన డీఎస్ కన్నన్ సైరా సినిమాకి కూడా తన రచనా సహకారం అందించారు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయనే కధ అలాగే డైలాగ్స్ రాసినట్టు చెబుతున్నారు.

ఇక ఈ సినిమా రాజుల కాలం నాటి సినిమా కాబట్టి రాజస్థాన్‌ లోని కొన్ని కోటల వద్ద షూటింగ్‌ జరిపే అవకాశం ఉంది. మడకరి నాయక అనే రాజు కర్నాటక ప్రాంతంలోని చిత్రదుర్గ కోటను పరిపాలించాడు. ముందుగా కస్తూరి రంగప్ప నాయక్‌ 1748లో చిత్రదుర్గను పాలించినప్పటికి, వారసుడు లేక మరణించడంతో చిత్రదుర్గకు దగ్గరగా ఉన్న జానకల్లుదుర్గకు చెందిన భరమప్ప నాయక్ కుమారుడే ఈ మడకరి నాయక్. పన్నేండేళ్ల వయసులోనే చిత్రదుర్గానికి రాజయ్యాడు. 1779 లో హైదర్‌ ఆలి మరియు అతని  కుమారుడు టిప్పు సుల్తానుతో జరిగిన యుద్ధంలో మడకరి నాయక్‌ ఓడిపోవడంవలన చిత్రదుర్గ హైదర్‌ఆలి వశమైనది. తదనంతరం టిప్పిసుల్తాను బ్రిటీషు వారిచేతిలో ఓడిపొయ్యిన పిమ్మట 'చిత్రదుర్గ' మైసూరుకు చెందిన ఒయల్‌ కుటుంబపాలనలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రనే తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు.

More Related Stories