English   

మరోసారి రవితేజ సరసన నేలటిక్కెట్టు భామ

Raviteja Malavikasharma.jpg
2020-03-03 17:09:43

డిస్కో రాజా సినిమాతో పర్లేదనిపించుకున్న రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మనోడికి బాగా అచ్చొచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాలో నటించబోతున్నాడు.

రాక్షసుడు ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడు. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్న రమేష్‌ వర్మ చెప్పిన కథకి రవితేజ బాగా కనెక్ట్ అయ్యారట. క్రాక్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరానే మొదలు కానుంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా మాళవిక శర్మను ఎంపిక చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో రవితేజ సరసన ‘నేల టికెట్టు’ నటించిన ఈ భామ ప్రస్తుతం రామ్‌ హీరోగా చేస్తున్న రెడ్‌ లో నటిస్తోంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక రవితేజ- రమేష్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో నటించనుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే పేరు ప్రచారంలో ఉంది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలోనే చిత్రీకరణ జరుపుకోనుంది.

More Related Stories