English   

మరోసారి సాయి పల్లవి-శర్వా జోడీ

sharwanad
2020-03-03 19:17:42

చేసిన మొదటి సినిమాతోనే మన పక్కింటి పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా మారిపోయిన 'ఫిదా' హీరోయిన్ సాయి పల్లవి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ అమ్మడు తన మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాక తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఎంత రెమ్యునరేషన్ పెంచిన ఆమెకు సినిమా అవకాశాలు తగ్గడం లేదు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న సినిమా శ్రీకారం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి కిషోర్ రెడ్డి ఒక కొత్త దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ పలు ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం చేస్తున్నాటు ప్రచారం జరిగినా అది ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు. అయితే శర్వానంద్ మరో సినిమాకు కమిట్ అయినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. నేను శైలజ లాంటి సూపర్ హిట్ అందించిన కిషోర్ ఇప్పుడు రామ్ హీరోగా రెడ్ సినిమా తెరకేక్కిస్తున్నాడు. అది పూర్తయ్యాక ఆయన దర్శకత్వంలో శర్వానంద్ నటించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో  సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జోడి ఇదివరకు పడి పడి లేచే మనసుకు కలిసి పనిచేసారు. ఆ సినిమా పెద్దగా ఆడకున్నా వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా కుదిరించి.

 

More Related Stories