English   

విశాల్ పెళ్లి ఎప్పుడు.. ఆగిపోయిందా ఏంటి..

vishal
2020-03-04 07:02:34

విశాల్ పెళ్లి ఎప్పుడు.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళనాట కూడా ఇదే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ దీనికి సమాధానం మాత్రం చెప్పలేదు ఈ హీరో. ఆ మధ్య అనీషా రెడ్డితో ఈయన నిశ్చితార్థం జరిగింది. జరిగి కూడా చాలా నెలలు గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. అడిగితే ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ డేట్ మాత్రం చెప్పడం లేదు. అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టడం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఇదివరకే చెప్పాడు విశాల్. ఇప్పుడు అన్నట్లే తన పెళ్లి ముచ్చట్లు చెబుతున్నాడు ఈ హీరో. ఈయన త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. స్నేహితురాల అనీషా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్లిద్దరు ఏడడుగులు నడవబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగినా కూడా వీళ్ల పెళ్లిపై రోజుకో వార్త బయటికి వస్తుంది. ఈమె పెళ్లి చూపులు సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. విజయ్ దేవరకొండను డబ్బులు కావాలి అంటూ అడిగే గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఈమె నటించింది. ఉన్నది రెండు నిమిషాలే అయినా కూడా ఆ సీన్ బాగానే గుర్తుండిపోయింది ప్రేక్షకులకు. ఈమెకు విశాల్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. దాంతో ఇప్పుడు వీళ్లిద్దరు ఏడడుగులు నడవడానికి సిద్ధమైపోయారు. విశాల్ పెళ్లితో తమిళనాట అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ డేట్ చెప్పకుండా సతాయిస్తున్నాడు విశాల్.

More Related Stories