English   

మహేష్ బాబు, అల్లు అర్జున్ గొడవ మామూలుగా లేదుగా..

maheshbabu
2020-03-04 07:08:29

ఇప్పుడు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా వీళ్ళ వార్ ఆశ్చర్యపరుస్తుంది. సంక్రాంతి నుంచి ఒకరి వెంట ఒకరు పడుతున్నారు. అప్పుడు సినిమా విడుదల తేదీ నుంచి ఇప్పుడు డిజిటల్ విడుదల వరకు.. చివరికి పాటల విడుదల వరకు కూడా ఒకర్ని మించి మరొకరు తమ పంతం చూపిస్తున్నారు. అప్పట్లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో విడుదలకు ముందు బన్నీ, మహేష్ బాగానే పోట్లాడారు. ఒకరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కాసేపటికే మరొకరు వస్తుందని ప్రకటించాడు. ఈ వార్ చూసి నిజంగానే అంతా షాక్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఏ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఇలా బాక్సాఫీస్ వార్ కు సై అంటే సై అనలేదు. కానీ ఆ మధ్య అదే జరిగింది. చివరికి జనవరి 12న అల వైకుంఠపురములో సినిమా వస్తే దానికి ఒక్కరోజు ముందు జనవరి 11న సరిలేరు నీకెవ్వరు వచ్చింది. పండక్కి వచ్చిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పటికీ సంక్రాంతి సినిమాల వేడి మాత్రం చల్లారట్లేదు.

వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. విడుదల తర్వాత కలెక్షన్స్, రికార్డుల విషయంలోనూ ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. ఒకరిని మించి మరొకరు రికార్డుల పోస్టర్స్ విడుదల చేసారు. ఇప్పుడు కూడా వీలు దొరికిన ప్రతీసారి అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు పోటీ పడుతూనే ఉన్నాయి. అల.. వైకుంఠపురంలో నుంచి వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సామజవరగమన, బుట్టబొమ్మ, ఓ మై డాడీ.. ఫుల్ వీడియో సాంగ్స్ సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు రాములో రాముల వీడియో సాంగ్ వచ్చేసింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇప్పటికీ బన్నీకి పోటీగా వెళ్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర పోరులో మహేష్ కంటే బన్నీ ముందున్నాడు. అల వైకుంఠపురములో సినిమాలో ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. మహేష్ మాత్రం తన కెరీర్ రికార్డులు తిరగరాసుకున్నాడు. ఇదిలా ఉంటే మొన్న అల వైకుంఠపురములో టైటిల్ వీడియో సాంగ్ విడుదలైనపుడు దానికి పోటీగా మైండ్ బ్లాక్ సాంగ్ విడుదల చేసాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు రాములో రాములా అంటూ బన్నీ వస్తే.. సరిలేరు నుంచి 'సూర్యుడివో చంద్రుడివో.. ' ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇప్పటికీ ఈ ఇద్దరు హీరోల మధ్య హీట్ సాగుతూనే ఉంది. విడుదలై 50 రోజుల తర్వాత కూడా ఇంకా అదే హీట్ చూపించడం మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చే విషయమే. 2021లో కూడా కచ్చితంగా మహేష్ బాబు, బన్నీ సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ తో అల్లు అర్జున్.. పరుశురామ్ తో మహేష్ బాబు సినిమాలు చేస్తున్నారు.

More Related Stories