English   

ప్రభాస్ తో ఆఫర్ వదులుకున్న అనుష్క

prabhas
2020-03-04 07:23:14

భాగమతి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని మరీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా సినిమా సైలెన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. మొత్తం షూట్ అంతా అమెరికాలో చేసుకున్న ఈ మూవీని గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు ముందు ప్రచారం జరిగింది. ఆ తరువాత జనవరి 31 అన్నారు. అలా అది వాయిదాలు పడుతూ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది.  మొత్తం అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  మీద ఆమె చాలా ఆశలే పెట్టుకుంది.

అయితే ఈ సినిమా కోసం ఆమె ఏకంగా ప్రభాస్ సినిమా ఆఫర్ ని వద్దనుకున్నదని అంటున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో స్టైలిష్ మూవీ “సాహో ” రూపొందిన విషయం తెలిసిందే. అనుష్క ” నిశ్శబ్ధం” మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా “సాహో ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు అఫర్ వచ్చిందట. నాలుగు సూపర్ హిట్ మూవీస్ లో ప్రభాస్ తో నటించిన అనుష్కకు మరొక సారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో ఆమె చేస్తుందనే అన్తుకున్నారు. అయితే అమెరికా షూటింగ్ పర్మిషన్స్ అంత త్వరగా దొరికేవి కాదని నిశ్శబ్దం మేకర్స్ ఆమెను బతిమాలడుకున్నారని అంటున్నారు. అనుష్క కూడా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ ఆఫర్ ను వదులుకుందని చెబుతున్నారు.

 

More Related Stories