English   

పవన్‌తో హిట్ కొట్టు.. బన్నీతో జట్టు కట్టు..

pk
2020-03-04 07:33:11

ఇప్పుడు వేణు శ్రీరామ్ కు బన్నీ ఇచ్చిన ఆఫర్ ఇదే. ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు కొన్నిసార్లు బంపర్ ఆఫర్స్ వస్తుంటాయి కానీ వర్కవుట్ మాత్రం అంత త్వరగా అవ్వవు. ఇప్పుడు వేణు శ్రీరామ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎంసిఏ లాంటి విజయం తర్వాత కూడా ఈయన తర్వాత సినిమా కోసం చాలా రోజులు వేచి చూడాల్సిన అవసరం వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా అనౌన్స్ చేసినా కూడా అది వర్కవుట్ కాలేదు. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాను తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు వేణు. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. మే 15న వకీల్ సాబ్ విడుదల కానుంది. పింక్ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది.

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కూడా బాగానే వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడికి బన్నీ కూడా పరీక్ష పెడుతున్నాడు. తనతో సినిమా చేయాలంటే ముందు పవన్ తో చేస్తున్న సినిమాతో హిట్ కొట్టి చూపించాలి. వకీల్ సాబ్ హిట్ అయితేనే ఐకాన్ తెరకెక్కుతుందని ఆయన చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ చేతుల్లోనే ఇప్పుడు ఐకాన్ భవిష్యత్తు ఉందన్నమాట. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. డిజే సినిమా తర్వాత బన్నీ, దిల్ రాజు కాంబోలో ఐకాన్ సినిమా అనౌన్స్ చేసారు. అయితే ఉన్నట్లుండి సినిమా అటకెక్కింది. ఇప్పుడు పట్టాలెక్కాలంటే పవన్ సినిమా హిట్టవ్వాలి. మరి వేణు ఏం చేస్తాడో చూడాలిక.

More Related Stories