English   

బన్నీ ఐకాన్ ని వకీల్ సాబ్ నిలబెడతాడా

Allu Arjun
2020-03-04 10:07:14

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో'.. పూజా హేగ్దే కథానాయకగా నటించిన ఈ సినిమా మొన్న సంక్రాంతికి రిలీజయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. చాలా చోట్ల నాన్ బాహుబలు రికార్డులు అన్నీ ఈ సినిమా తన పేరున రాసేసుకుంది. గీతా ఆర్ట్స్, హరిక హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మించి జాయింట్ గా జాక్ పాట్ కొట్టారు.

అయితే ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది కూడా. బన్నీ షూట్ లో జాయిన్ కావడం కోసమే చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడు. అయితే నిజానికి ఈ రెండు సినిమాల కంటే ముందే బన్ని 'ఐకాన్' సినిమా ప్రకటించాడు. వేణు శ్రీరామ్ దీనికి దర్శకుడుగా దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని గట్టిగానే ఎస్టాబ్లిష్ చేశారు.

అయితే ఈ సినిమాని ఆగిపోయిందని కొద్దిరోజులు క్రితం ప్రచారం జరిగింది. దానికి తోడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాకి షిఫ్ట్ కావడంతో సినిమా ఆగిపోయిందని అందరు అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఐకాన్ తెరకేక్కేదీ లేనిదీ పవన్ పింక్ సినిమా డిసైడ్ చేస్తుందట. అదేంటంటే దిల్ రాజు కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ పింక్ హిట్ కొడితేనే ఐకాన్ చేయడానికి డబ్బు పెడతానని దిల్ రాజు కండిషన్ పెట్టాడట. దీంతో ఆ సినిమా ఏమి చేస్తుందా అనే టెన్షన్ అయితే అందరిలోనూ నెలకొని ఉంది.

More Related Stories