సంక్రాంతికి పవన్ సినిమా

మన తెలుగులో దర్శకులు కొందరు హీరోలకి అభిమానులుగా చెప్పుకుంటూ ఉంటారు. అందులోనూ కొందరికి అయితే ఫలానా కాంపౌండ్ డైరెక్టర్ అని పేరుకూడా వచ్చేస్తుంది. అలా మెగా కాంపౌండ్ డైరెక్టర్ గా పెరుతెచ్చుకున్న వారులో హరీష్ శంకర్ ఒకరు. ఆయన ఇప్పటి వరకు అరడజను సినిమాలు చేస్తే నాలుగు మెగా హీరోలతో చేసినవే. ఇప్పటికే పవన్ తో ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ తీసిన ఆయన, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడమే తన ధ్యేయం అని చెబుతూ ఉంటాడు.
అయితే ఆయనకు తన కల నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చినా పవన్ కోసం చేజార్చుకున్నాడని అంటున్నారు. త్వరలో ఆయన పవన్‌తో మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు. పవన్ ఇప్పటికే రెండు సినిమాలు చేస్తుండడంతో అవి పూర్తి అయ్యాక అంటే ఈ ఏడాది మే తర్వాత ఆ సినిమా పట్టాలెక్కనుంది. అయితే చిరంజీవి కొరటాల సినిమా తరువాత లూసిఫార్ రీమేక్ చేయాలి. ఆ సినిమాని రీమేక్ సినిమాల స్పెష్టలిస్ట్ గా పేరు తెచ్చుకున్న హరీష్ కు అప్పజెప్పాలనుకున్నాడట చరణ్.
అయితే ఇప్పుడు ఆ సినిమా ఒప్పుకుంటే పవన్ సినిమాకి ఇబ్బంది అని భావించి చిరు ఇంటికి వెళ్లి మరీ కుదరదని చెప్పి వచ్చాడట, పవన్ కల్యాణ్ తో సినిమా వల్ల ఈ సినిమా చెయ్యలేకపోతున్నాని చెప్పాడట. ఇక పవన్ తో సినిమా మేలో మొదలెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.