English   

హ్యాపీ బర్త్ డే శ్రద్ధాదాస్.. అందాల బుట్టబొమ్మ.. 

 Shraddha Das
2020-03-04 19:10:19

శ్రద్ధా దాస్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. పదేళ్ళ కిందే టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ ఇప్పటి వరకు క్రేజ్ మాత్రం రాలేదు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించినా కూడా ఈమెకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో దారం తెగిన గాలిపటంలా అన్ని ఇండస్ట్రీలను చుట్టేసింది. అయినా కూడా శ్రద్ధా సక్సెస్ కాలేదు. దాంతో వెబ్ సిరీస్ లు చేసుకుంటూ హాట్ ఫోటోషూట్స్ తో చేసుకుంటూ కెరీర్ వెల్లదీస్తుంది. మార్చ్ 4న ఈమె పుట్టిన రోజు. దాంతో హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 

ఈ ఫోటోలు త‌ర్వాత‌.. అమ్మ‌డు ఇచ్చిన పోజులు చూసిన త‌ర్వాత ఎవ్వ‌రికైనా బాపురే ఏం భామరే అనకుండా ఉండలేకపోతున్నారు. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. కానీ అవ‌కాశాలే ముద్దుగుమ్మ‌ను చిన్న‌చూపు చూస్తున్నాయి. తెలుగులో ఆర్య 2, మొగుడు లాంటి సినిమాల్లో హై రేంజ్ లో అందాలు ఆర‌బోసినా.. ఛాన్సులు రావ‌ట్లేదు. హిందీలో ఈ భామ న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాపులే. అక్క‌డ గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, జిద్ సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. 

ఈ సినిమాల్లో అందాలు ఓ రేంజ్ లో ఆర‌బోసినా.. ద‌ర్శ‌కులు, హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో ఇలా మ‌ధ్య మ‌ధ్య‌లో ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్స్ తో ద‌ర్శ‌కుల మ‌దిలో ప‌డ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్పుడు కూడా చిట్టిపొట్టి దుస్తుల్లో ఇలా రెచ్చిపోయింది. మ‌రి ఈ భామ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా ఏ ద‌ర్శ‌కుడైనా క‌రిగిపోతాడేమో చూడాలి.

More Related Stories