వ్యభిచారం కేసులో జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్

జబర్దస్త్ కామెడీ షో అనేది ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పటికప్పుడు టిఆర్పీ రేటింగ్స్ తో పాటు కాంట్రవర్సీలకి ఇది కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఆరేళ్లుగా టాప్ ప్రోగ్రామ్ గా ఇది ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూనే ఉంది. కామెడీ షోస్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది జబర్దస్త్. అయితే ఎంత నవ్విస్తుందో.. అంత వివాదాల్లో ఇరుక్కుంటుంది ఈ షో.
ఇక ఇప్పుడు దీని గురించి మరో సంచలన వార్త బయటికి వస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు వారాలుగా విడగొట్టి చేస్తున్న ఈ కార్యక్రమంలో దొరబాబు అంటే తెలియని వారు ఉండరు. ఆది టీంలో చేసే అతను అందరికీ పరిచితమే. అయితే మరో ఆర్టిస్ట్ తో కలిసి ఇప్పుడు దొరబాబు వ్యభిచారం కేసులో దొరకడం సంచలనంగా మారింది. విశాఖపట్నంలోని మాధవ దారిలో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.
టాస్క్ ఫోర్స్ డీఎస్పీ చేసిన ఈ దాడుల్లో జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు,పరదేశీ ఇద్దరూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ హైపర్ ఆది టీమ్ లోనే నటిస్తారు. వ్యభిచార గృహ నిర్వాహకులు,విటులతో పాటు మొత్తం 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.