English   

ప్రభాస్‌కు కరోనా భయం.. మాస్క్‌తో ఎయిర్ పోర్టులో.. 

Prabhas
2020-03-04 14:12:19

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ కరోనా. డాక్టర్లతో పాటు శాస్త్రవేత్తలను కూడా ఈ వైరస్ గురించి కుచ్ కరోనా అంటూ చాలా మంది అడుగుతున్నా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికీ వేల మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఇండియాకు కూడా ఈ వైరస్ వస్తుంది. దాంతో మన వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బయటికి వస్తే కచ్చితంగా మాస్కులు వేసుకుని కానీ రావడం లేదు. ఇప్పుడు హీరో ప్రభాస్ కూడా ఇదే చేసాడు. 

ఈయన తాజాగా రాధాకృష్ణ కుమార్ సినిమా కోసం యూరప్ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ వచ్చిన ప్రభాస్ అక్కడ మాస్క్ వేసుకుని కనిపించాడు. ముందు ఈయనెవరో అంటూ కనిపెట్టలేకపోయినా కూడా తర్వాత ప్రభాస్ అని తెలిసి అంతా షాక్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు ఆర్ఎఫ్సీలో షూట్ జరగడంతో అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు దేశం దాటేస్తున్నారు కదా అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూజా హెగ్డే కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఈ సినిమా కూడా దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 

సాహో సినిమా నిరాశ పరిచినా కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు ప్రభాస్. దీనికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. ప్రభాస్ సొంత బ్యానర్ గీతాకృష్ణతో పాటు యువీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఏదేమైనా కూడా కరోనా దెబ్బకు అంతా వణికిపోతున్నారిప్పుడు. 

More Related Stories