English   

సుకుమార్‌తో హీరో నిఖిల్ సెన్సేషనల్ ప్రాజెక్ట్.. 

Sukumar
2020-03-04 16:41:25

అర్జున్ సురవరం సినిమా తర్వాత నిఖిల్ రేంజ్ మళ్లీ పెరిగిపోయింది. ఈ సినిమా ఏడాది వాయిదాల తర్వాత విడుదలైనా కూడా మంచి విజయం సాధించింది. 6 కోట్ల బిజినెస్ చేస్తే 9 కోట్ల వరకు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. దాంతో ఇప్పుడు ఈయన వరస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కార్తికేయ 2 సినిమాకు ఫిక్సైపోయాడు నిఖిల్. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఇదే ఏడాది కార్తికేయ 2 విడుదల కానుంది కూడా. ఇక ఇప్పుడు మరో భారీ సినిమాకు కూడా ఈయన ఓకే చెప్పాడు. 

కుమారి 21ఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమా ఇచ్చిన సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఓ వైపు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తూనే మరోవైపు నిఖిల్ కు కూడా కథ అందిస్తున్నాడు. మరోవైపు ఉప్పెన సినిమాకు కూడా సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చూపిస్తున్నాడు ఈయన. 

ఇప్పుడు కూడా నిఖిల్ హీరోగా కుమారి 21ఎఫ్ దర్శకుడితో సుకుమార్ రైటింగ్స్ లో సినిమా సెట్ అయింది. దీనికి గీతా ఆర్ట్స్ 2 కూడా మరో నిర్మాణ సంస్థ. మార్చ్ 5న దీనికి ముహూర్తం పెట్టనున్నారు. టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు నిర్మాతలు. మొత్తానికి వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నిఖిల్. 

More Related Stories