English   

మన హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగిపోతుంది..

 Pawan Kalyan
2020-03-04 17:25:41

ప్రతీ ఏడాది ఖర్చులు పెరిగిపోతున్నాయి.. దాంతో పాటు అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు మన హీరోలు కూడా రెమ్యునరేషన్ భారీగానే పెంచేసారు. కొత్త ఏడాది ఒక్కో హీరో పారితోషికం చూస్తుంటే నిర్మాతలకు నిద్ర కూడా పట్టడం లేదు. ఒకప్పుడు 20 కోట్లు తీసుకుంటే అమ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాకు ఈజీగా 50 కోట్ల వరకు తీసుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ బాలీవుడ్ హీరోల కంటే భారీగా పెరిగిపోయింది. మిర్చి సమయంలో ఈయన సినిమాకు 6 కోట్ల వరకు తీసుకునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం 100 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రభాస్ కంటే తోపు ఎవరూ లేరు పారితోషికంలో. అశ్వినిదత్ బ్యానర్ లో కమిటైన సినిమాకు కూడా దాదాపు 110 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక పవన్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఈయన గత సినిమా అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా కూడా ఈయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది. 

రెండేళ్ళ తర్వాత ఈయన నటిస్తున్న పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ కోసం ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే డబ్బులా కాకుండా వాటా తీసుకుంటున్నాడు పవర్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన పారితోషికం భారీగానే పెంచేసాడు. ఈయనకు వరస విజయాలు కూడా వస్తుండటంతో సినిమాకు 60 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. పారితోషికం కంటే కూడా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ తీసుకుంటున్నాడు. దాంతో సినిమాకు ఈజీగా 50 కోట్లు దక్కుతున్నయాని అంచనా. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం 40 కోట్లు రైట్స్ రూపంలో వచ్చాయని తెలుస్తుంది. దాంతో పాటు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురంలో సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఈ సినిమాకు డబ్బుతో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా తీసుకున్నాడు బన్నీ. 

దాంతో సినిమాకు 30 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు అందుకుంటున్నాడు. RRR కోసం 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు ఈయన. రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా 40 కోట్లు ఉండే అవకాశం ఉంది. నాని 10 కోట్లు.. నాగచైతన్య, రామ్ 8 కోట్ల వరకు అందుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగిందని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోల రెమ్యునరేషన్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. చిరంజీవి రీఎంట్రీ తర్వాత బయట సినిమాలు చేయలేదు కాబట్టి ఆయన ఎంత తీసుకుంటున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే లెక్కల ప్రకారం చూస్తుంటే సినిమాకు ఈజీగా 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మన హీరోల ముందు బలాదూర్ అయిపోతున్నారంతే. 

More Related Stories