English   

పవన్ ఇమేజ్ కోసం పింక్ కథ మార్చేస్తున్నారా.. 

Dil raju pawan
2020-03-04 18:37:25

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ ఎంత వచ్చిందో.. నెగిటివ్ కూడా అంతే వచ్చింది. కాకపోతే పవన్ అభిమానులు చేసిన హంగామా ముందు నెగిటివిటీ కనిపించడం లేదు అంతే. కాకపోతే ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. దానికి ఓ లాయర్ మూలంగా ఉంటాడు. అలాంటి ఎమోషనల్ కథను ఇప్పుడు పవన్ కోసం మార్చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పవన్ మాస్ ఇమేజ్ కోసం పింక్ కథను ఇష్టమొచ్చినట్లు మార్చి తీస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పైగా పవన్ లుక్ కూడా అదేదో మాస్ సినిమాలా ఉందని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ఈయన సినిమాల్లోకి రావడం కూడా కొందరికి నచ్చడం లేదు. ఓ వైపు అమరావతిలో రైతులు చచ్చిపోతున్నారు.. మరోవైపు రాజకీయంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు కుతకుతలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన మీతో పాటే ఉంటుందని పవన్ చెప్పాడు. కానీ అంతలోనే సినిమాల్లోకి వచ్చేసాడు. 

ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన నటిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. మే 15న సినిమా విడుదల కానుంది కూడా. దాంతో పాటే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు ఈయన. ఇందులో బందిపోటుగా నటిస్తున్నాడు ఈయన. దీనికోసం క్రిష్ పకడ్బందీగా కథ సిద్ధం చేసాడు. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ కూడా లైన్ లోనే ఉన్నాడు.

ఇదిలా ఉంటే సినిమాల్లోకి పవన్ కల్యాణ్ రాంగ్ టైమ్ ఎంట్రీ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఇన్ని రోజులు తాను సినిమాలు చేయను కేవలం రాజకీయాలే అంటూ ఇక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు జనసేనాని కాస్తా పవర్ స్టార్ అయిపోయాడు. మళ్లీ కెమెరా ముందుకొచ్చేసాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఆంధ్రా వెళ్తున్నాడు. అక్కడ అమరావతిలో రైతుల కోసం పోరాడుతానని చెప్తున్నాడు. ఆ మధ్య ఢిల్లీ కూడా వెళ్లొచ్చాడు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ డైలాగులు కూడా చెబుతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పేలుతున్నాయి.

ఒక్క ఎమ్మెల్యే ఉన్న పవన్.. 151 ఎమ్మెల్యేలు ఉన్న జగన్ పార్టీని ఎలా కూల్చేస్తాడబ్బా అంటూ పవన్ పై జోకులు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు. ఇదిలా ఉంటే ఈ సమయంలో పవన్ సినిమాల్లోకి వచ్చుండకూడదంటూ నేరుగానే విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రం అట్టుడుకిపోతుంటే ఇప్పుడు మీకు సినిమాలు కావాల్సి వచ్చాయా అంటూ ఓ రేంజ్ లో పవన్ తో ఆడుకుంటున్నారు నెటిజన్లు. దీనికి పవన్ మాత్రం పార్టీని నడపాలంటే తనకు డబ్బులు కావాలని.. సినిమాలు చేస్తే తప్ప తనకు డబ్బులు రావని తేల్చేసాడు. రైతుల కోసం పోరాడుతున్న పవన్.. ఇప్పుడు సినిమాలు అంటూ వచ్చేస్తే కచ్చితంగా అధికార పక్షం పవన్ కల్యాణ్ తీరును ఎండగట్టక మానదు. మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి పవన్ ఎలా బయటికి వస్తాడో చూడాలిక. 

More Related Stories