English   

నిఖిల్ సుకుమార్ సినిమా రేపే ఓపెనింగ్

nikil
2020-03-05 06:50:43

మొన్నీమధ్య అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో నిఖిల్ సిద్దార్థ. తమిళంలో సూపర్ హిట్ అయిన కణితన్ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసి హిట్ కొట్టాడు ఈ హీరో. మాతృకను తెరకెక్కించిన సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్న నిఖిల్ అప్పట్లోనే తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రకాష్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా అనౌన్స్ చేశాడు. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమకి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను రేపు లాంచ్ చేయనుండగా టైటిల్ కూడా రేపు ప్రకటించనున్నారు. గతంలో సుకుమార్ అందించిన కథాకథనాలతో 'కుమారి 21F' ను సూర్యప్రతాప్ హిట్ కొట్టాడు. అయితే హీరో, దర్శకుల వివరాలు అయితే వెల్లడించారు కానీ నటీనటుల వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి పూర్త్జి వివరాలు రేపు ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

More Related Stories