రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి..తల పగిలి హాస్పిటల్ లో

బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మీద బీరు బాటిళ్లతో దాడి చేశారు కొందరు యువకులు. అందుతోన్న సమాచారాన్ని బట్టి రాహుల్ సిప్లిగంజ్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వీకెండ్ కావడంతో రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు రాత్రి వెళ్లారు. కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగాడు. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో రెచ్చిపోయిన అల్లరిమూక రాహుల్‌ను బీరు సీసాలతో తీవ్రంగా గాయపరిచారని చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ఆయన బిగ్ బాస్ లో పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వెంట ఉన్నది ఆమేనా లేక వేరే ఎవరయినానా ? అనేది తెలియాల్సి ఉంది.