English   

మహేష్ బాబు మాట వినని దర్శకుడు పరుశురామ్..

mb
2020-03-05 07:07:17

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు బాగా బిజీ అయిపోయాడు. ఈయన ప్రస్తుతం చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ పాత్ర చిత్రీకరణ కూడా త్వరలోనే మొదలు కానుంది. దీనికోసం నెల రోజులకు పైగానే డేట్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఈ సినిమాతో పాటు పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిటయ్యాడు సూపర్ స్టార్. అయితే ఈ సినిమాలో నటించడానికి మరింత టైమ్ పట్టేలా ఉంది. మే లేదంటే జూన్ వరకు మహేష్ బాబు బిజీగా ఉంటాడు. దాంతో ఈ లోపు నాగ చైతన్య హీరోగా నటించే సినిమా పూర్తి చేయమని ఈ దర్శకుడికి మహేష్ చెప్పినట్లు తెలుస్తుంది. కానీ ఆయన మాత్రం మహేష్ కోసం నాగచైతన్య సినిమాను పూర్తిగా పక్కనబెట్టేసాడు. రెండు సినిమాలు ఒకేసారి చేసే అలవాటు మహేష్ బాబుకు లేదు అందుకే చిరంజీవి సినిమా పూర్తి చేసిన తర్వాతే పరశురామ్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు ఈయన. అందుకే చైతూ సినిమాను చేసుకోవాలని చెప్పినా కూడా పరుశురామ్ మాత్రం నో చెబుతున్నట్లు తెలుస్తుంది. లేకలేక మహేష్ బాబు ఆఫర్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి సమయంలో రిస్కులు తీసుకోడానికి ఈ దర్శకుడు ఇష్టపడటం లేదు. అందుకే మహేష్ సినిమా పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి సినిమాలు చేయకూడదని ఫిక్సైపోయాడు ఈయన. జూన్ కాకపోతే జులై వరకు కూడా వేచి చూస్తానంటున్నాడు పరుశురామ్. అలా మహేష్ చెప్పినా కూడా ఈయన ఇప్పుడు వినడం లేదు.

More Related Stories