నిఖిల్ కొత్త సినిమాకి ఆసక్తికర టైటిల్

దర్శకుడు సుకుమార్ ఒకవైపు సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కిస్తూనే మరో వైపు మంచి చిత్రాలని నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బేనర్లో వచ్చిన కుమారి 21 ఎఫ్ అనే చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ నిర్మాణ సంస్థ నుండి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. గతంలో దర్శకుడు అనే సినిమా తీస్తే అది పెద్దగా ఆడలేదు. తాజాగా సుకుమార్ రైటింగ్స్ సంస్థ జీఏ2 పిక్చర్స్‌తో కలిసి సినిమాని నిర్మించేందుకు సిద్ధమైంది. నిఖిల్ హీరోగా రూపొందనున్న ఈ సినిమా కొద్ది సేపటి క్రితం లాంచ్ అయింది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఇక ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, ఈ సినిమా టైటిల్ 18 పేజెస్. ఇక ఈ సినిమాని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనుండగా, మూవీకి స్టోరీ, స్క్రీన్‌ప్లే సుకుమార్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్ హీరోగా రూపొందనున్న కార్తికేయ2 సినిమా కూడా కొద్ది రోజుల క్రితమే తిరుపతిలో మొదలయింది.