English   

రాహుల్ మీద దాడి చేసింది ఆ ఎమ్మెల్యే మనుషులట

Rahul
2020-03-05 11:46:28

సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ పై అర్ధరాత్రి దాడి కలకలం రేపుతోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ప్రిస్మ్ పబ్‌ కు బుధవారం వెళ్లారు రాహుల్. అయితే, కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు దీంతో అతను మరో వర్గంతో గొడవ పడినట్టు ప్రచారం జరిగింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం పబ్బులో రాహుల్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులని పోలీసులు తేల్చారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంధువులు కూడా నిన్న రాహుల్ వెళ్ళినప్పుడు పబ్ కి వెళ్ళారని అలా వెళ్ళిన సమయంలో వారిలో ఒకరిని రాహుల్ సిప్లిగంజ్ వేధించారని దీంతో వారు రాహుల్‌పై బీరు బాటిళ్లతో దాడి చేశారని చెబుతున్నారు పోలీసులు. ఈ విషయం మీద పబ్ యాజమాన్యం నుండి సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ సద్దుమణిగేలా చేశారని అంటున్నారు. 

ఈ గొడవ అనంతరం తలకి గాయంతో గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రాహుల్ సిప్లిగంజ్ ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయారు.. తనకి ఏమీ కాలేదని.. చిన్న గాయం మాత్రమే అయ్యిందంటూ ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేయించుకున్న నుంచి రాహుల్ అక్కడి వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే, పబ్బులో జరిగిన గొడవ విషయంగా సుమోటోగా కేసు నమోదు చేస్తామని గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు.

More Related Stories