English   

కరోనా ఎఫెక్ట్.. ఈ వారం సినిమాలు విడుదలయ్యేనా..

Corona Virus
2020-03-05 12:09:35

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఇన్నిరోజులు చైనాను కుదిపేసిన ఈ వైరస్ ఇండియాకు వచ్చింది. ఇక్కడ కూడా పాజిటివ్ కేసులు వస్తుండటంతో అంతా వణికిపోతున్నారు. ముఖ్యంగా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో సినిమాలు విడుదలైనా కూడా కలెక్షన్లు వస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. 

ఈ వారం దాదాపు అరడజన్ సినిమాలు విడుదల కానున్నాయి. అందులో బ్రహ్మాజీ తనయుడు నటించిన ఓ పిట్టకథ.. బాలు అడుసుమిల్లి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన అనుకున్నదొక్కటి అయినదొక్కటితో పాటు మరో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా భయంతో ఈ సినిమాలను వాయిదా వేయాలని చూస్తున్నారు నిర్మాతలు. లేదంటే మాత్రం కచ్చితంగా నష్టపోక తప్పదు. ధైర్యం చేసి విడుదల చేసినా కూడా ఇప్పుడున్న భయానికి సినిమాలు బాగున్నా కూడా బయటికి వచ్చేలా కనిపించడం లేదు జనాలు. పైగా అన్నీ చిన్న సినిమాలే కావడంతో అసలు ఆసక్తి కూడా చూపించరు. 

దాంతో ఇప్పుడు కరోనా భయం తెలుగు సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కూడా వేధిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే పరిస్థితి.. తర్వాత ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నారు దర్శకులు. భీష్మ, హిట్ లాంటి సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు రావడం లేదు. ఈ వారం సినిమాలకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అని కొన్ని థియేటర్స్ సొంతంగానే మూసేస్తున్నారని తెలుస్తుంది. 

More Related Stories