English   

తెలంగాణపై నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. 

 Actress Kasthuri
2020-03-05 12:20:43

కొందరు హీరోయిన్లు కేవలం కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉండాలని చూస్తుంటారు. సినిమాలు చేసినా చేయకపోయినా వాళ్ల ఫోకస్ మాత్రం ఎప్పుడూ వివాదాలపైనే ఉంటుంది. ఇప్పుడు తమిళ నటి కస్తూరి కూడా ఇదే చేసింది. అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది కదా.. ఆమె కస్తూరి అంటే. ప్రస్తుతం బి గ్రేడ్ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ సీరియల్స్ కూడా చేస్తుంది ఈమె. ఈ మధ్యే అజిత్, కార్తి లాంటి స్టార్ హీరోలపై సెటైర్లు వేసి వాళ్ల అభిమానులతో చివాట్లు తింది ఈ ముదురు భామ. 

ఇక ఇప్పుడు ఏకంగా తెలంగాణపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనాలో చిక్కుకున్న బాదితుల తరహాలో తాను కరోనా వ్యాపిస్తున్న తెలంగాణలో ఉన్నానని.. తాను హైదరాబాద్‌లో చిక్కుకుపోయానని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో అంతా ఈమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. హైదరాబాద్ అంటే ఎలా కనిపిస్తుంది.. నీ యిష్టమొచ్చినట్లు మాట్లాడితుంటే చూస్తూ ఊరుకోరు.. పో బయటికి నిన్ను ఎవడుండమన్నాడు ఇక్కడ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

కొన్ని రోజుల ఓ పని మీద హైదరాబాద్ వచ్చింది కస్తూరి. ఈమె తెలుగులో గృహలక్ష్మి అనే సీరియల్ చేస్తుంది. ఈ సీరియల్ షూటింగ్ కోసమే ఇక్కడే ఉంటుంది. ఇక పని కూడా పూర్తి కావడంతో చెన్నై తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్న తరుణంలో హైదరాబాద్‌లో కరోనా కేసులు బయటపడటం.. గాంధీలో ఇప్పటికే కొంతమంది చేరడంతో బెంబేతెత్తిపోయిన కస్తూరి శంషాబాద్ ఏయిర్‌సోర్ట్‌కి వెళ్లడానికి భయపడుతోందని తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఈ పోస్ట్ పెట్టింది. ఈమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తెలంగాణలో కరోనా వైరస్ పేషెంట్ వున్నారా.. ఇక నేను హైదరాబాద్‌లో చిక్కుకు పోవాల్సిందేనా.. ఎందుకంటే నాకు ఎయిర్ పోర్ట్‌కి వెళ్లాలంటే భయంగా ఉందంటూ ఈమె చేసిన ట్వీట్ చూసి చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు. 

More Related Stories