English   

చిరంజీవితో రాజకీయాలు చేస్తే బాగోదు.. నాగబాబు వార్నింగ్.. 

Nagababu
2020-03-05 12:35:57

చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన తీరు చూస్తుంటే ఇప్పుడే కాదు ఎప్పుడూ రాజకీయాల వైపు వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఈ మధ్య అనవసరంగా ఆయన పేరును కొందరు రాజకీయాల్లోకి లాగి తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారని ఫైర్ అయ్యాడు నాగబాబు. ముఖ్యంగా మొన్నామధ్య అమరావతి పేరుతో చిరు ఇంటి ముందు ధర్నా చేయాలని కొందరు సూచించారు. దాంతో చిరంజీవి ఇళ్లు రణరంగంగా మారిపోయింది.. అంతా పోలీసుల కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. 

ఇలాంటి సమయంలో నాగబాబు స్పందించాడు. అన్నయ్య రాజధానిపై తన అభిప్రాయాన్ని చెప్తే విజయవాడకు చెందిన కొందరు నిర్మాతలు ఏదేదో మాట్లాడేశారని ఆయన ఫైర్ అయ్యాడు. అలా అభిప్రాయాలు చెప్పడం తప్పా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. తన అభిప్రాయం చెప్తే కూడా ఇంటి ముందు ధర్నాలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాడు నాగబాబు. అలా ఇంటి ముందు ధర్నాలు చేయాలనే ఆలోచన మానుకోండి.. నేను, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అమరావతికి మా వంతు సపోర్ట్ చేస్తున్నామని తెలిపాడు ఈయన. 

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోరాటం చేస్తున్నాడని గుర్తు చేసాడు నాగబాబు. దయచేసి సినిమాలు చేస్తున్న తమ అన్నయ్యను రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పాడు ఈయన. అలా లాగి ఆయనతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు. దయచేసి వ్యక్తిగత స్వార్ధం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేసి మెగా అభిమానులతో పాటు జనసైనికుల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దని నాగబాబు కోరాడు. 

More Related Stories