English   

రత్తాలు బికినీకి తగ్గట్లేదుగా.. లక్ష్మీ రాయ్ హాట్ షో.. 

Raai Laxmi
2020-03-05 15:28:31

ఈ మధ్య బాలీవుడ్, కోలీవుడ్ లపై ఫోకస్ చేసిన లక్ష్మీ రాయ్ ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై పడింది. ఇక్కడ బిజీ కావడానికి ట్రై చేస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ జాతకం మారలేదు. ఆ మధ్య వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. 

తాజాగా తమిళనాట అడపాదడపా సినిమాలు చేస్తుంది లక్ష్మీరాయ్. ఈ మధ్యే ఈమె నటించిన నియ 2 కూడా ఫ్లాప్ అయింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, కేథరిన్ కూడా నటించారు. పాము పగబడితే ఎలా ఉంటుందనేది కథ. ఇప్పుడు సినిమాలు కూడా లేకపోవడంతో బికినీ షోతో మతులు చెడగొట్టే పని పెట్టుకుంది లక్ష్మీరాయ్. తాజాగా మరోసారి బీచ్ లో బ్లాక్ బికినీ వేసుకుని బ్లాక్ బస్టర్ అందాలన్నీ బయటపెడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు బొద్దుగా ఉన్న లక్ష్మీరాయ్ ఇప్పుడు సన్నగా మెరుపుతీగలా మారిపోయింది. 

ఇదిలా ఉంటే కొందరు బరువు తగ్గితే కొందరు అసలు బాగుండరని.. కానీ మీరు బరువు తగ్గిన తర్వాత కూడా చాలా బాగున్నారు అంటూ అభిమానులు చెబుతున్నారని.. అది విన్న తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది అంటుంది లక్ష్మీరాయ్. ఇక బికినీ ఫోటోల గురించి కూడా మాట్లాడింది. బీచ్ కి వెళ్లినప్పుడు బికినీ కచ్చితంగా వేసుకుంటారని.. అది చాలా కామన్.. దాన్ని అనవసరంగా భూతద్దంలో పెట్టి చూడొద్దు ఉంటుంది లక్ష్మీ రాయ్. తాను కూడా అలా వెళ్లినప్పుడు సెల్ఫీలు తీసుకోవడం ఒక సరదా అని.. ఒక వేళ మీరు బికినీలో తను చూడలేకపోతే కళ్ళు మూసుకోండి అంటూ సమాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఒక్క హిట్ కోసం ఎన్ని అందాలు ఆరబోయడానికైనా సిద్ధమేనంటోంది అంటోంది లక్ష్మీ రాయ్.

More Related Stories