అఖిల్ కి యాక్సిడెంట్..ఆగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మాతలు బన్నీవాసు , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ముందు నుండీ ప్రచారం జరుగుతున్నట్టే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ షూటింగ్ సమయంలో అఖిల్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో ఉండగా అతడికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అతడిని హాస్పిటల్ కి హుటాహుటిన తరలించగా అతని చేతికి ఫ్రాక్చర్ అయిందని తేలింది. దీంతో డాక్టర్లు వారం బెడ్ రెస్ట్ చెప్పారట. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోగా, మార్చి 10 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా ఆశలు అంచనాలు పెట్టేసుకున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశముంది.