English   

పవన్ - క్రిష్ సినిమా కోసం ఆ గేమ్ వాడుతున్నారా

krish
2020-03-05 19:55:36

 పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలో హైదరాబాద్‌లో మొదలు కాబోతోంది. ప్రత్యేకంగా రూపొందించిన పడవ సెట్స్‌లో ఈ షూట్ చేయబోతున్నారు. ఇందులో నటించే కథానాయికల ఎంపికపై మీద కూడా మేకర్స్ ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం షాడో ఫైటర్ అనే గేమ్ నుండి ఫైట్స్ చేయిస్తున్నారని అంటున్నారు. ఈ గేం రిలీజ్ అయిన కొత్తలో చాలా ఫేమస్, ఒకరకంగా మల్లయుద్ధంలా ఉండే ఈ గేంలో అన్ని రకాల ఆయుధాలు అంటే కత్తి, డాలుతో యుద్ధం చేసేది అన్నమాట. ఇక పవన్ చేసే కధ రాజుల కాలం నాటిది అని అర్ధం అవుతోంది. ఇక ఈ సినిమాని ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది. తాజాగా ఆ లిస్ట్ లో జయంత్ సీ పరాన్జీ పేరు కూడా చేరింది.

 

More Related Stories