English   

మరలా మహర్షి కాంబినేషన్

pooja
2020-03-05 20:11:39

మొన్న  మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు  నీకెవ్వరు’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కి మహేష్ ని ఎక్కడో కూర్చోబెట్టింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు మెగా కాంపౌండ్‌ భారీగానే రెమ్యునరేషన్ చెప్పినట్టు చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి గెస్ట్‌గా వచ్చినప్పటి నుండి చిరంజీవి, మహేష్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే ఆయన ఈ సినిమా అనుకున్న గానే అందుకే ఒప్పుకున్నారట. అయితే చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు విద్యార్ధి నాయకుడిగా పవర్‌ఫుల్ పాత్ర చేయబోతున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంక ఈ సినిమాలో మహేష్ సరసన మళ్ళీ పూజా హెగ్దే నటిస్తున్నట్టు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో మహర్షి సినిమా చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కోసం మహేష్ సరసన మళ్ళీ పూజనే ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు.

 

More Related Stories