English   

మంచు మనోజ్ సినిమాకు రామ్ చరణ్ సాయం..

charan
2020-03-06 06:57:09

విడాకుల తర్వాత మంచు మనోజ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఆ విషయం మరచిపోవడానికి తనకు ఉన్న మార్గం సినిమాలు మాత్రమే అంటున్నాడు ఈ మంచు వారబ్బాయి. అందుకే వరుసగా సినిమాలు చేయడానికి ఫిక్స్ అయిపోయాడు ఈ కుర్రహీరో. మూడేళ్ల కింద ఒక్కడు మిగిలాడు సినిమా చేసిన తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు మంచు మనోజ్. ఇక ఇప్పుడు ఈయన శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో అహం బ్రహ్మాస్మి సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంఎం ఆర్ట్స్ మొదలుపెట్టి అందులోనే వరుస సినిమాలు చేయబోతున్నాడు మంచు మనోజ్. ఇందులో తొలి ప్రయత్నంగా శ్రీకాంత్ దర్శకత్వంలో అహంబ్రహ్మాస్మి సినిమా చేస్తున్నాడు. ఇందులో మనోజ్ క్యారెక్టర్ కూడా విభిన్నంగా ఉండబోతుంది. కెరీర్ మొదటి నుంచి కూడా కొత్త కథలకు పెద్ద పీట వేసే మనోజ్ ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ మార్చి 6వ తేదీ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరగబోతుంది. దీనికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించాడు మంచు మనోజ్. నీకు మనసారా స్వాగతం పలుకుతున్నాను చెర్రీ అంటూ ట్వీట్ చేశాడు మనోజ్. ఈ సినిమాలో తమిళ యాంకర్ ప్రియ భాస్కర్ హీరోయిన్ గా నటించబోతోంది. మరి ఈ సినిమాతో మనోజ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories