అనసూయ ఫ్యామిలీని కలిపిన కరోనా వైరస్..

అదేంటి.. అదెలా సాధ్యమైంది అని వింత అనుమానాలు వస్తున్నాయి కదా. ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా వైరస్ పై ఇప్పుడు అనసూయ పెట్టిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 60 దేశాలకు పైగా కరోనా వైరస్ బారిన పడ్డాయి. ఇప్పటికే దాదాపు 3,000 మంది ఈ వ్యాధి బారినపడి మరణించారు. లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇండియాలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో కూడా కొందరికి పాజిటివ్ రావడంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇంటి నుంచి కాలు బయట వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
దాంతో ఈ కరోనా వైరస్ పుణ్యమా అని కుటుంబంతో గడిపే సమయం దొరికింది అంటూ అనసూయ భరద్వాజ్ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. చాలా రోజుల నుంచి బిజీ షెడ్యూల్ తో కనీసం పిల్లలతో కూడా సమయం గడపలేని స్థాయికి వెళ్లిపోయింది అనసూయ. ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని కొన్ని రోజులు షూటింగ్కు బ్రేక్ దొరికింది. దాంతో హాయిగా పిల్లలతో సమయం గడుపుతుంది అనసూయ భరద్వాజ్.
ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత కుటుంబంతో గడిపాను.. పిల్లలతో హాయిగా ఉంది.. ఈ వైరస్ అందరిని టెన్షన్ పెడుతున్న కూడా విలువైన ఫ్యామిలీ టైం గడిపేలా చేస్తోంది అంటూ ట్వీట్ చేసింది అనసూయ భరద్వాజ్. ఇప్పుడే ఐరన్ మాన్, ఎండ్ గేమ్ సినిమాలు చూశాను అంటూ పోస్ట్ చేసింది. అనసూయ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా మందికి కరోనా వైరస్ మేలు చేసింది. బిజీగా ఉండే వాళ్లను కుటుంబాలకు మళ్ళీ చేరువ చేసింది ఈ వైరస్. పైగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ దూరంగా ఉండొచ్చని ఇప్పటికే వైద్య నిపుణులు తెలియజేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది.