English   

అనుష్క శెట్టిపై అలిగిన అభిమానులు..

  Anushka Shetty
2020-03-06 10:42:10

ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు కుదిరితే 3 సినిమాలు చేసింది అనుష్క. కానీ ఈ రెండు మూడేళ్లకు కూడా ఒక సినిమా చేయడానికి ఈమెకు టైం దొరకడం లేదు. దాంతో అభిమానులు కూడా బాగా హర్ట్ అవుతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఈమెపై అలిగారు. ఇక మీద వరుసగా సినిమాలు చేస్తానని అనౌన్స్ మెంట్ ఇచ్చినా కూడా ఆ మాటమీద నిలబడకుండా ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు అనుష్క శెట్టి. 

ప్రస్తుతం ఈమె నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏప్రిల్ 2 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు. తమిళ హీరో మాధవన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సవ్యసాచి తర్వాత ఆయన నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. దానికి తోడు అనుష్క నిశ్శబ్దం సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు అన్ని చోట్ల అంత క్రేజ్ వుందా అంటే సమాధానం మాత్రం చెప్పడం కాస్త కష్టమే. అయితే ఆ సినిమాలో విషయం అలా ఉంది అంటున్నాడు నిర్మాత కోన వెంకట్. కచ్చితంగా ఈ సినిమాతో అన్ని ఇండస్ట్రీలలో అనుష్క విజయం అందుకుంటుందని ఆయన ధీమాగా చెబుతున్నాడు. 

మరోవైపు ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ నటించారు. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి ఒక నటుడిని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ చేశారు. దాంతో పాత్రకు సరిపోయేలా అక్కడి నుండి తీసుకున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆయన నిశ్శబ్దం నిర్మాతలకు చుక్కలు చూపించాడని తెలుస్తుంది. అనుష్క సినిమాలు చేయకపోవడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. ఇంతకు ముందులా వరస సినిమాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. మరి జేజమ్మ అభిమానుల కోరిక ను ఎంతవరకు మన్నిస్తుందో చూడాలి. 

More Related Stories