English   

అనుకున్నదొక్కటి అయినదొక్కటి రివ్యూ

Anukunnadi Okati Ayindi Okkati
2020-03-06 22:37:29

నలుగురు అమ్మాయిలు.. హీరో లేడు.. సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలాంటి కథను నడిపించాలంటే ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. అందులోనూ కొత్త దర్శకుడికి ఇంకా కష్టం. కొత్త దర్శకుడు బాలు అడుసుమిల్లి ఇలాంటి ప్రయోగమే చేసాడు. ఈయన తెరకెక్కించిన అనుకున్నది ఒకటి అయినది ఒకటి నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. మరి ఈ కథ ఎలా ఉంది..?

కథ:

ధన్య, సిద్ధి, త్రిదా, కోమలి ప్రసాద్ నలుగురు స్నేహితులు. ఎవరికి వాళ్లు సొంతంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అందులో సిధ్ధి మినహా ముగ్గురు ఒకే రూమ్‌లో ఉంటారు. కాస్త బోల్డ్ నెస్ ఎక్కువగా ఉండే కారెక్టర్స్ వీళ్లు. అందులో సిధ్దికి పెళ్లై ఉంటుంది. అయితే సెక్సువల్ లైఫ్‌లో హ్యాపీ ఉండదు. అలాంటి ఈ నలుగురు కలిసి గోవాలో ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో ఓ అబ్బాయిని కూడా బుక్ చేసుకుంటారు. కానీ అనుకోకుండా అతన్ని చంపేయాల్సి వస్తుంది.. ఆ తర్వాత డెడ్ బాడీని ఏం చేసారు.. ఎలా తప్పించుకుంటారు అనేది అసలు కథ..

కథనం:

హీరో లేకుండా కథను నడపడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లను పెట్టి కథ రాసుకోవడం ఇంకా కష్టం. తొలి సినిమాకే చాలా ప్రయోగాలు చేసాడు దర్శకుడు బాలు అడుసుమిల్లి. నలుగురు అమ్మాయిలు.. వాళ్లు చేసే క్రైమ్ చుట్టూ తిరిగే కథ ఈ అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి. సినిమా మొదలైన తొలి 25 నిమిషాల వరకు కూడా చాలా స్లో నెరేషన్ ఉంటుంది. దానికి తోడు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా భారీగానే ఉంటాయి. ఒక్కో సీన్‌లో అయితే బాగానే శృతి మించారు కూడా. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గోవాకు వెళ్ళేంత వరకు కూడా కథ ముందుకెళ్లదు. ఆ తర్వాత కాస్త ఆసక్తి కలుగుతుంది. 

ఈ కథను దర్శకుడు మరింత ఆసక్తికరంగా చూపించొచ్చు కానీ అక్కడే కాస్త గాడి తప్పినట్లు అనిపించింది. టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టుగానే ఇది కాస్త బోల్డ్ నెస్ ఉన్న కథ. తెలుగులో ఇలాంటి కథలు రావడం అరుదుగానే జరుగుతుంటాయి. ముఖ్యంగా మరీ అంత బోల్డ్ నెస్ కూడా మనోళ్లు తట్టుకోలేరు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా శృతి మించిన డైలాగులు కూడా ఉన్నాయి. అడల్ట్ కామెడీతో అక్కడక్కడా నవ్వులు పూయించాడు దర్శకుడు బాలు. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు సీన్స్ కూడా డిజైన్ చేసాడు. అయితే అక్కడ్నుంచే మళ్లీ కథను కూడా ముందుకు తీసుకెళ్లాడు. 

నలుగురు అమ్మాయిలు కలిస్తే పరిస్థితి ఇలా ఉంటుందా అన్నట్లుగా ఫస్టాఫ్ సాగుతుంది. అక్కడక్కడా బాగా డోస్ ఎక్కువైపోయింది కూడా. గోవా వెళ్లిన తర్వాత ఓ అబ్బాయి కోసం అమ్మాయిలు మరీ అంతగా కొట్టుకోవడం.. నేను ముందు కాదు నేను ముందు అంటూ మీద పడిపోవడం అనేది కాస్త ఓవర్ అనిపిస్తుంది. అయితే అక్కడి వరకు అలా అలా సాగిన కథ ఇంటర్వెల్‌కు ముందు కాస్త ఊపు అందుకుంటుంది. అనుకోకుండా వచ్చిన అబ్బాయిని వాళ్లు చంపేయడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆ డెడ్ బాడీని ఎలా దాచేస్తారు.. ఆ తర్వాత కేసు నుంచి వాళ్లెలా బయట పడ్డారు అనేది కథ. ఓవరాల్‌గా డబుల్ మీనింగ్ డైలాగులతో అక్కడక్కడా నవ్వులు పూయించిన అడల్ట్ కామెడీ ఇది.

నటీనటులు:

ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, సిద్ది ఇద్నానీ, త్రిధా చౌదరి అందరు గ్లామర్‌ ప్రధానంగా ముందుకు సాగారు. అందరికీ అందరూ బాగానే ఉన్నారు.. అందాలను బాగానే ఒలకబోశారు. కథ కూడా వాళ్ళ చుట్టూనే తిరగడంతో పర్లేదనిపించారు. అందరికంటే ధన్యకు కాస్త స్కోప్ ఎక్కువగా ఉంది. మిగిలిన పాత్రల్లో సమీర్, హిమజ పర్లేదు. జాక్‌ పాత్ర కడుపుబ్బా బాగానే నవ్విస్తుంది.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు సంగీతం ప్లస్ అయింది. వికాస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అయితే పాటలు అవసరం లేదు ఈ చిత్రంలో. దర్శకుడు కూడా ఇదే చేసాడు. ఎడిటింగ్ చాలా వీక్. సినిమాకు మెయిన్ మైనస్ కూడా అదే. సినిమాటోగ్రఫీ పర్లేదు. గోవా అందాలు బాగానే చూపించాడు ఈయన. ఇక దర్శకుడు బాలు అడుసుమిల్లి కథను బోల్డ్‌గా రాసుకున్నా కూడా తెరకెక్కించిన విధానం మాత్రం గాడి తప్పింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ కావడం.. అక్కడక్కడా శృతి మించడం కూడా సినిమాపై నమ్మకం పోయేలా చేసాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్‌గా ఉంది. క్లైమాక్స్ నవ్వులు బాగున్నాయి. మొత్తంగా దర్శకుడు బాలు మరింతగా స్క్రీన్ ప్లేపై కూర్చుని ఉంటే బాగుండేదేమో..? నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:

అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. అదే జరిగింది..

రేటింగ్: 2 /5.

More Related Stories