అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ .. అంతా సస్పెన్స్..

అనుష్క హీరోయిన్గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నిశ్శబ్దం సినిమా ట్రైలర్ ఈ రోజు నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాని కోన వెంకట్ సమర్పిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క చెవుడు ఉన్న యువతిగా నటించింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది.
నేను చెబుతోంది అర్థమవుతుందా?, ఓ ఘోస్ట్ ఇదంతా చేస్తోందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి నా సెన్సిబిలిటీస్ అంగీకరించలేదు అంటూ అంజలి చెప్పే డైలాగ్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. మాధవన్, అనుష్క ల వెకేషన్ లో జరిగిన భయంకర సంఘటనల వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనేదే మిస్టరీ. ఆ ఘటనలో బాధితురాలిగా అనుష్క కనిపిస్తుండగా, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా అంజలి నటిస్తుంది. షాలిని పాండే అనుష్క స్నేహితురాలు పాత్ర చేస్తోంది.
ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు మంచి టాక్ వచ్చింది. ట్రైలర్ కూడా ఆ అంచనాలకు తగ్గ కుండా మరింత పెంచే విధంగా కట్ చేశారు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ విడుదల కానుంది.