English   

కొత్త సినిమా ప్రకటించిన శర్వా..అనుకున్నట్టుగానే 

Sharwanand
2020-03-06 18:05:29

హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక కొత్త సినిమా ప్రకటన వెలువడింది. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. గతంలో ఈయన శర్వాతో ‘పడిపడి లేచె మనసు’ నిర్మించారు. నాయిక, సాంకేతిక వర్గ వివరాలు ఇంకా ప్రకటించలేదు. 

అయితే  ఈ సినిమాలో  సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జోడి ఇదివరకు పడి పడి లేచే మనసుకు కలిసి పనిచేసారు. ఆ సినిమా పెద్దగా ఆడకున్నా వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా కుదిరించి. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ రానుంది. ప్రస్తుతం శర్వానంద్‌ ‘శ్రీకారం’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో రైతుగా కనిపించనున్నాడు శర్వా. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Related Stories