English   

విజయ్ దేవరకొండ పేరిట ఫేక్ అకౌంట్...ట్రాప్ చేసి పట్టారు

vijay
2020-03-06 20:21:11

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ మోసానికి పాల్పడుతున్న యువకుడు ఎట్టకేలకి దొరికాడు. ఆ యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో ట్రాప్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు విజయ్ టీమ్. మోసగాడి ఫోన్ నెంబర్ ని కనిపెట్టి అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని రివర్స్ ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తెలియని సదరు యువకుడు అతను అమ్మాయిలను మోసం చేసినట్టే తాను దొరికిపోయాడు. విజయ్ టీమ్ లోని సభ్యుడు ఒక అమ్మాయిలా చాట్ చేస్తూ అతనిని నమ్మించి నిన్ను వెంటనే కలవాలని హైదరాబాద్ కి రప్పించారు. అతనిని ఫలానా చోటికి రమ్మన్న టీం అప్పటికే పోలీసులతో రెడీగా ఉండి పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సదరు వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రాంతకి చెందిన వ్యక్తి అని తేలింది. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోలకు చెందిన మహిళా అభిమానులు మరో పది మందితో కూడా అతను ఇలానే మోసం చేసి మాట్లాడుతున్నట్టు విచారణలో తేలింది.  

 

More Related Stories