English   

రాహుల్ సిప్లిగంజ్‌తో పబ్‌కు వెళ్లింది ఆ ఛానెల్ యాంకరేనా...

Rahul Sipligunj.jpg
2020-03-07 09:14:22

టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు తెలియని కొత్త కోణాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. ఆ రోజు రాత్రి తనపై పబ్‌లో ఎలా గొడవ జరిగిందో చూడండి అంటూ రాహుల్ సిప్లిగంజ్‌ తన ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేయడమే కాకుండా మంత్రి కేటీఆర్ ను కూడా న్యాయం చేయాలంటూ కోరాడు. తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి ఈ గొడవలో ప్రధానంగా వినిపిస్తున్నాడు. ఆయనతో పాటు ఉన్న కొందరు వ్యక్తులు తనపై దాడి చేసారంటూ రాహుల్ చెప్తున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు కూడా ధర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

ఇక ఇప్పుడు ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఆ రోజు రాహుల్ తో కలిసి పబ్ కు వెళ్లిన అమ్మాయిలు ఎవరు అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం విచారణలో వీళ్ల పేర్లు కూడా బయటికి వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు యాంకర్స్ తో కలిసి రాహుల్ పబ్ కు వెళ్లాడు. అందులో ఒకరు ప్రముఖ న్యూస్ ఛానెల్ లో సినిమా కార్యక్రమంకు యాంకర్ గా పని చేస్తుంది. గతంలో ఓ టాప్ ఛానెల్లో కూడా ఈమె ఓ సినిమా ప్రోగ్రామ్ కు యాంకర్ గా చేసింది. ఇప్పుడు మరో ఛానెల్లో యాంకర్ గా చేస్తుంది.

ఇంకొకరు మాత్రం రాహుల్ బంధువే. ఆ అమ్మాయి నుంచే ఈ యాంకర్ తో కూడా ఆయనకు కొన్నేళ్ల కింద పరిచయం అయింది. తరుచూ వాళ్లు పబ్ కు వెళ్లడం కూడా జరుగుతుంది. అలాగే గొడవ జరిగిన రోజు రాత్రి కూడా పబ్‌కు వెళ్లగా.. అక్కడ రితేష్ రెడ్డి ఓ యాంకర్‌పై కామెంట్ చేయడం.. అది చూసి రాహుల్ రివర్స్ కావడంతో అతడిపై పిడి గుద్దులతో వాళ్లు విరుచుకుపడటం జరిగాయి. ఈ కేసులో రాజకీయ రంగు ఉండటం.. పైగా అది గులాబీ దళం కావడంతో ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories