English   

లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడు... యువతి ఆరోపణ...

Lawrence Brother.jpg
2020-03-07 10:12:33

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టార్ లారెన్స్ రాఘవ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాలతోనే కాకుండా సోషల్ సర్వీస్ లో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు ఈయన. అయితే ఇప్పుడు లారెన్స్ తమ్ముడు వినోద్ అలియాస్ ఎల్విన్ మాత్రం మరోలా వార్తల్లో నిలిచాడు. ఈయన తనను కొన్ని రోజులుగా ప్రేమించాలంటూ వేధిస్తున్నాడని వరంగల్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఈమె. తనికిష్టం లేదని తేల్చిచెప్పినా కూడా ఇంకా వెంటపడి లారెన్స్ తమ్ముడు వినోద్ తనను హింసిస్తున్నాడని దివ్య అనే జూనియర్ ఆర్టిస్టు మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఈ విషయంపై లారెన్స్ కూడా ఏం మాట్లాడటం లేదని చెబుతుంది ఈమె.

వినోద్ చాలాకాలంగా వేధిస్తున్నాడని.. తాను కాదన్నానని పగ పెంచుకున్నాడని తేల్చి చెబుతుంది దివ్య. వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఇది వరకే ఈ విషయంపై ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని చెబుతుంది దివ్య. ఈ కేసు విషయంలో అక్కడి సీఐ.. వినోద్‌తో కుమ్మక్కై తనపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని గోడు వెల్లబోసుకుంది దివ్య. ఆ సీఐ ప్రస్తుతం ఏసీపీగా ఉన్నాడని.. కొన్నాళ్లు కొందరు తనను ఫాలో అవుతున్నారని.. తనను చంపేస్తారని భయంగా ఉందని చెబుతుంది ఈమె. సీఎం కేసీఆర్ నా ప్రాణాలు కాపాడాలంటూ కోరింది దివ్య. ఆమె ఆరోపణలపై వినోద్ గానీ, పోలీసులు కానీ.. మరోవైపు లారెన్స్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు.

More Related Stories