రాజమౌళిని వేధిస్తున్న ఆ ఒక్క కోరిక.. ఎవరు తీరుస్తారో మరి..

కొందరు గురువుని మించిన శిష్యులు అవుతారు.. మరికొందరు గురువుని ముంచిన శిష్యులు అనిపించుకుంటారు. ఇందులో రాజమౌళి తొలి లిస్ట్ లోకి వచ్చే రకమైతే.. రాజమౌళి శిష్యులు మాత్రం రెండో రకం. రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసి.. పది సినిమాల అనుభవంతోనే ఆయన్ని మించిపోయాడు రాజమౌళి. కానీ దర్శకధీరుడి దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు మాత్రం ఇప్పటివరకు సక్సెస్ అందుకోలేకపోయారు. ఓ రకంగా రాజమౌళి శిష్యుడు సినిమా చేస్తున్నాడంటే.. సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ అనే ముద్ర పడిపోయింది ఇండస్ట్రీలో.
అప్పుడెప్పుడో బాలయ్యతో మిత్రుడు అనే సినిమా చేసాడు మహదేవ్. ఆయన రాజమౌళి శిష్యుడు. ఆ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించారు. కానీ సినిమా ఆడలేదు. అప్పుడెప్పుడో అజయ్ హీరోగా డిఎస్ కన్నన్ సారాయి వీర్రాజు అనే సినిమా చేసాడు. ఆయన కూడా రాజమౌళి దగ్గర శిష్యరికం చేసాడు. ఆ తర్వాత నితిన్ ద్రోణ సినిమాతో కరుణకుమార్ అనే దర్శకుడు పరిచయమయ్యాడు. ఈయన కూడా దర్శకధీరుడి బ్యాచే. ఇది డిజాస్టరే.
తాజాగా ఈయన దర్శకత్వంలో పలాస సినిమా వచ్చింది. పలాస 1978 పేరుతో వచ్చిన ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మరోసారి రాజమౌళి శిష్యుడి సెంటిమెంట్ నిజమైంది. ఇక దిక్కులు చూడకు రామయ్యా సినిమాతో త్రికోటి దర్శకుడిగా మారాడు. ఈయన అంతే.. త్రికోటి రెండో సినిమా జువ్వ అయితే వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఆయన తర్వాత జగదీష్ తలసల కూడా లచ్చిందేవికో లెక్కంది సినిమాతో వచ్చి డిజాస్టర్ ఇచ్చాడు. కాంచి కూడా అంతే.. మరి రాజమౌళి శిష్యుడు ఎప్పుడు హిట్ కొడతారో చూడాలిక.