English   

వరుస సినిమాలు ఒప్పుకున్న లేడీ డైరెక్టర్ 

 Sudha Kongara
2020-03-07 10:35:05

తెలుగులో గురు సినిమా తెరకెక్కించిన సుధా కొంగర ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుధా కొంగర సూర్య హీరోగా 'ఆకాశమే నీ హద్దురా' అనే సినిమా చేస్తున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ సినిమా ఇది. ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ సినిమలో విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

తమిళ్ స్టార్ హీరో విజయ్‍ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్‍కి జోడీగా పూజాహేగ్డేను హీరోయిన్‌గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇది కాక  సుధ త్వరలోనే సింబు హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం చేయనుందని కూడా వార్తలొస్తున్నాయి. హీరో విజయ్‌తో చేయబోయే సినిమా కంటే ముందే తనకి స్నేహితుడయిన సింబుతో కలిసి పనిచేయనుందని తమిళ సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. 

సింబుకి - సుధ కొంగర చాలాకాలం నుంచి తెలుసు. మణిరత్నం దర్శకత్వంలో సింబు ‘చెక్క చివంత వానం’ అనే చిత్రం చేశాడు. ఆ తరువాత మరే సినిమా చేయలేదు. ఇప్పుడు ఈమె సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. థ్రిల్లర్‌ జానర్ లో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రాన్ని సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా నిర్మించనున్నారని అంటున్నారు.

More Related Stories