నో డౌట్.. మహేష్ బాబు అందులో నెంబర్ వన్..

ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీలో తన స్థానం మరింత మెరుగుపరుచుకున్నాడు సూపర్ స్టార్. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తనను మించిన వాళ్లు లేరని నిరూపించుకుంటున్నాడు ఈయన. ట్విట్టర్ ఫాలోయింగ్ లో సూపర్ స్టార్ కంటే తోపు ఎవరూ లేరు. ఈయన్ని మించిన స్టార్ సౌత్ ఇండియాలోనే లేడు. ట్విట్టర్ ఫాలోయర్స్ లో కొత్త రికార్డు సృష్టించాడు మహేష్ బాబు.
9 మిలియన్ ఫాలోవర్స్ అంటే అక్షరాలా 90 లక్షల మంది మహేశ్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా ఓ రికార్డ్. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు సౌత్ ఇడియాలోనే లేరు. ఒకప్పుడు ట్విట్టర్ లో మహేష్ కంటే సమంత ముందుండేది. కానీ ఇప్పుడు ఆమెను కూడా దాటేసాడు మహేష్ బాబు. ప్రస్తుతం సమంతకు 7.8 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. మహేష్ అందర్నీ దాటేసి ముందుకు వచ్చాడు. సౌత్ ఇండస్ట్రీలో 90 లక్షల ఫాలోయర్స్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు.
ఇక హీరోల విషయానికి వస్తే నాగార్జున ఫాలోవర్స్ కూడా 5.9 మిలియన్.. రానా 5.8 మిలియన్.. దర్శకధీరుడు రాజమౌళి 4.7 మిలియన్.. తమిళ హీరో సూర్య 5.5 మిలియన్.. పవన్ కళ్యాణ్ 3.8 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నారు. అయితే ఎంతమంది ఉన్నా మహేష్ బాబును బీట్ చేసే వాళ్లైతే లేరు. ప్రతీ చిన్న విషయాన్ని ట్విట్టర్ లో అభిమానులతో పంచుకోవడం సూపర్ స్టార్ కు ఉన్న అలవాటు. ఇదే ఆయన్ని ట్విట్టర్ లో నెంబర్ వన్ ను చేసింది.