English   

రవితేజ హీరోయిన్ మారిందా..

 NIdhi Agarwal
2020-03-07 11:51:21

డిస్కో రాజా సినిమాతో మరో డిజాస్టర్ రుచి చూసిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మనోడికి బాగా అచ్చొచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాలో నటించబోతున్నాడు. 

రాక్షసుడు ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడు. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్న రమేష్‌ వర్మ చెప్పిన కథకి రవితేజ బాగా కనెక్ట్ అయ్యారని ప్రచారం జరిగింది. క్రాక్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరానే మొదలు కానుంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా మాళవిక శర్మను ఎంపిక చేయనున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా ఆమె ఈ సినిమాలో నటించడం లేదని ఆమె స్థానంలో నిధి అగర్వాల్ లో తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే పేరు ప్రచారంలో ఉంది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలోనే షూట్ కి వెళ్లనుంది. 

More Related Stories