ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ అక్కడికి పూజా ..

తెలుగులో పూజా హెగ్డే ఇప్పుడు వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. ఒక్క టాలీవుడ్ కే ఆగిపోకుండా మరో పక్క బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో కూడా ఆడిపాడుతోంది. తాజాగా ఈ భామ ఓ క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు చిత్ర సీమ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అది కూడా ఏకంగా ఎనిమిదేళ్ళ తర్వాత తమిళ్ లో సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. 2012లో వచ్చిన తమిళ సినిమా ‘ముగమూడి’తో వెండితెరపైకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత తమిళ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు.
అక్కడి నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఇక్కడకోచ్చాక నెక్స్ట్ ఆప్షన్ బాలీవుడ్ కావడంతో అక్కడికి కూడా వెళ్లి సినిమాలు మొదలెట్టింది. అయితే ఆమెకు ఇన్నేళ్ల తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో తెర పంచుకునే ఛాన్స్ వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే ఆయన ‘గురు’ ఫేం సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా క్సోఅమే విజయ్ సరసన పూజాను తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సుధా చెప్పిన కథ ఆమెకు నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం అందుతోంది.