English   

చెంపదెబ్బ కొడితే విడాకులా... ఏం కాన్సెప్ట్ ఇది...

Thappad Collections.jpg
2020-03-07 22:47:21

మిగిలిన దేశాల్లో పెళ్లిపై ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో తెలియదు కానీ మన దేశంలో మాత్రం పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇక్కడ ఒక్కసారి ముడిపడితే కలిసే బతకాలి.. కష్టమొచ్చినా సుఖమొచ్చినా కలిసి పంచుకోవాలి అంటారు పెద్దలు. అందుకే ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత వాళ్లను సీతారాముల్లా ఉండాలని దీవిస్తుంటారు. సినిమా వాళ్లు కూడా దాన్ని ప్రతిబింబించే ఎన్నో సినిమాలు చేసారు. పెళ్లి కాన్సెప్టుతో వచ్చిన చాలా సినిమాలు సంచలనాలు సృష్టించాయి. కానీ అదే సినిమా వాళ్లు ఒక్కోసారి పెళ్లి విలువ తగ్గించే సినిమాలు కూడా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఆత్మాభిమానం, మనోభావాలు అంటూ పెళ్లి విలువ తీస్తున్నారని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ రావడానికి కారణం థప్పడ్ సినిమా. తాప్సీ నటించిన ఈ సినిమాపై సంచలన కామెంట్స్ చేసాడు దర్శకుడు అహ్మద్ ఖాన్. తాప్సీ నటించిన థప్పడ్ సినిమా గత వారమే విడుదలైంది. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. భర్త చెంపదెబ్బ కొడితే వెంటనే విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లే భార్య కథ అది. దాన్ని మెలోడ్రామా జోడించి ఆడవాళ్ల మనోభావాల చుట్టూ కథ అల్లుకున్నాడు దర్శకుడు అనుభవ్ సిన్హా. అయితే కొడితేనే విడాకులు ఇచ్చేయాలా తిరిగి కొట్టలేరా అని ప్రశ్నిస్తున్నాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అహ్మద్ ఖాన్. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు ఈయన. థప్పడ్ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు.

ఇందులో ఇళ్లు స్వర్గం.. భర్తే దేవుడు అనుకొని జీవించే సగటు మహిళగా తాప్సీ నటించింది. అయితే ఆమెను అనుకోకుండా ఓ సారి చెంపదెబ్బ కొడతాడు భర్త. దాంతో మనోభావాలు దెబ్బతిన్నాయని విడాకులు కావాలని న్యాయస్థానం వరకు వెళ్తుంది. కోర్టు కూడా దీనికి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ. ఈ భారతదేశంలో వివాహ బంధానికి ఒక అర్థం ఉందని.. వీలైతే దాన్ని నిలబెట్టే సినిమాలు చేయాలి కానీ ఇలా విడగొట్టే సినిమాలు కాదు అంటున్నాడు ఈయన. భార్యాభర్తల్లో గొడవలు రావడం సహజం.. భర్త ఒక్క చెంప దెబ్బ కొట్టగానే భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం అనే కాన్సెప్ట్ తనకు అస్సలు అర్థం కావడం లేదని చెబుతున్నాడు అహ్మద్ ఖాన్.

ఏదేమైనా కూడా భర్తతో సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకోవాలి.. చివరికి ఏ ఆప్షన్ లేనపుడు విడిపోవడం వాళ్ల ఇష్టం.. అంతేకానీ చిన్న చిన్న కారణాలకే విడిపోవాలని చెప్పడం అర్థం లేనిది అంటున్నాడు ఈయన.

More Related Stories