English   

కాజల్ - అల్లరి నరేష్ కాంబినేషన్ లో కొరియన్ రీమేక్

kajal
2020-03-08 10:32:40

కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' చిత్రాన్ని తెలుగులో 'ఓ బేబీ'గా రీమేక్ చేసిన సురేష్ బాబు హిట్టు కొట్టిన సంగతి తెల్సిందే. ఆ సినిమా మంచి హిట్ కావడంతో నందిని రెడ్డితో మరో సినిమాను నిర్మించాలని సురేష్ బాబు ఫిక్స్ అయ్యాడు. దానికి కూడా మరో కొరియన్ మూవీనే ఫిక్స్ అయారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఒక కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దమయ్యారు. ఆ రీమేక్ కు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె నో చెప్పిందిట. దీంతో ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం కాజల్ కు తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవు. తమిళంలో ఇండియన్ 2 మరియు హిందీలో ఒక చిత్రాన్ని మాత్రమే చేస్తోంది. అందుకే కాజల్ ఖచ్చితంగా ఈ రీమేక్ కు ఒప్పుకుందని అంటున్నారు. సినిమాలో మరో కీలక పాత్ర కోసం అల్లరి నరేష్ ని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. అయితే ముందు నందినీ రెడ్డి అనుకున్నా ఇప్పుడు ఆమె బిజీ అయిపోవడంతో ఆమె ఈ సినిమా చేస్తుందా లేదా అనేది అనుమానమే. అయితే ప్రస్తుతం ఒక రైటర్స్ టీమ్ మాత్రం ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. అంతా పూర్తయ్యాక దానిని నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారా లేదా అనేది తేలనుంది.

More Related Stories