English   

ఆర్ఆర్ఆర్ ని భలే వాడేస్తున్న తేజ

teja
2020-03-08 12:06:01

ఒక్క పెద్ద సినిమా కూడా తీయకుండానే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్న దర్శకుడు తేజ చాల సంవత్సరాల తరువాత రానాతో తీసిన ‘నేనేరాజు నేనేమంత్రి’తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఆ తరువాత తీసిన ‘సీత’ సినిమాతో మళ్లీ ప్లాప్ అందుకున్నాడు. అందుకే ఈ సారి ఏకంగా రెండు సినిమాలు ప్రకటించాడు.  అందులో ఒకటి ‘రానా’ హీరోగా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ అదే ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానా నెగిటివ్ రోల్ పాత్రలోనటిస్తునట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అని షార్ట్ ఫార్మ్ లో ఈ టైటిల్ వస్తుంది. ఇక జక్కన్న ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని సోషల్ మీడియాలో ఈ హాష్ ట్యాగ్ లకు ఉన్న డిమాండ్ గురించి తెలిసిందే. దీంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఈ సినిమాకు కూడా కలిసి వస్తుందంటున్నారు. ఇది ఖచ్చితంగా కావాలని తేజ ప్లే చేస్తున్న మార్కెటింగ్ స్టాటజీ అని చెబుతున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ను తేజ భలే వాడుకుంటున్నాడని చెబుతున్నారు.ప్రస్తుతం రానా ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో హీరోగా రాబోతున్న ‘విరాట పర్వం` షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

More Related Stories